Monday, December 23, 2024

నిలోఫర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం అయ్యింది. బాలుడిని ఎత్తుకుని వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా, కోతబాతంకడకు చెందిన కట్రోతు మమత, శ్రీను వ్యవసాయం చేస్తుంటారు. వీరికి పుట్టిన కుమారుడు ఆరోగ్యం బాగలేకపోవడంతో నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. అదే ఆస్పత్రికి ఈ నెల 14వ తేదీన నగరానికి చెందిన ఫరీదాబేగం తన పెద్దకుమారుడి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చేర్పించింది. పెద్ద కుమారిడి వద్ద తల్లి ఉండగా ఫరీదాబేగం తన చిన్న కుమారుడు ఫైసల్ ఖాన్(6నెలలు)తో కలిసి పేషంట్ల వేయింటింగ్ హాల్‌లో ఉంది. అదే సమయంలో ఫరీదాబేగంతో మమత మాటలు కలిపింది. తన రెండు నెలల కుమారుడికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని ఫరీదా బేగంకి చెప్పింది.

బాలుడికి పాలు పట్టిన ఫరీదా సాయంత్రం 6.30 గంటలకు నిద్రపోవడంతో కిందపడుకోబెట్టి ఫుడ్ కోసం బయటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన మమత బాలుడిని తీసుకుని ఆస్పత్రి బయటికి వచ్చింది. అక్కడి నుంచి జేబిఎస్‌కు వెళ్లి అక్కడ భార్యభర్త కలిసి తమ గ్రామానికి వెళ్లిపోయారు. ఫుడ్ కోసం బయటికి వెళ్లిన ఫరీదా బేగం తిరిగి వచ్చే సరికి తన కుమారుడు కన్పించకపోవడంతో ఆందోళన చెంది చుట్టుపక్కల వారిని అడిగింది. ఎవరూ సరిగా సమాధానం చెప్పకపోవడంతో తనతో ఇప్పటి వరకు ఉన్న మహిళపై అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే ఆస్పత్రి వర్గాలకు చెప్పడంతో సిసిటివిలను తనిఖీ చేయగా అవిపనిచేయలేదు. దీంతో వెంటనే బాధితురాలు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, నాంపల్లి పోలీసులు కలిసి నిందితుల గుర్తింపు కోసం గాలించారు. ఆస్పత్రలోని సిసి కెమెరాలు పనిచేయకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారింది. దర్యాప్తు చేసిన పోలీసులు బాలుడి కిడ్నాప్‌కు ఆస్పత్రిలోని ఇద్దరు సహకరించారని గుర్తించారు.

దాంతో దర్యాప్తు ముమ్మరం చేసి దాదాపుగా 100 సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితులు జేబిఎస్‌కు అక్కడి నుంచి నిజామాబాద్, కామారెడ్డికి వెళ్లినట్లు గుర్తించారు. చివరికి నిందితులను గుర్తించి బాలుడిని నగరానికి తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్లు అభిలాష్, రాజునాయక్, నాగార్జున, ఎస్సై లు నవీన్‌కుమార్, నిరంజన్ తదితరులు పట్టుకున్నారు.

పుట్టిన పిల్లలు మృతిచెందడంతో….పెంచుకుందామని…
బాలుడిని కిడ్నాప్ చేసి మమత, శ్రీను దంపతులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. గత కొంత కాలం నుంచి వీరికి పిల్లలు పట్టి చనిపోతున్నారు. 15 రోజుల క్రితం వీరికి బాలుడు పుట్టాడు. అనారోగ్యానికి గురి కావడంతో నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ జంట అధిక రక్తస్నిగ్ధత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల మగ పిల్లలు పుడితే వెంటనే చనిపోతారు, కేవలం ఆడపిల్ల పుడితేనే బతుకుతారు. దురదృష్ట వశాత్తు వీరికి ఇప్పటి వరకు ఇద్దరు మగపిల్లలు పుట్టి చనిపోయారు. ముడో పిల్లోడు కూడా చనిపోతాడని భావించి కిడ్నాప్ చేశారు. ఆస్పత్రికి పిల్లలతో వచ్చే వారిని గమనిస్తు అదును కోసం చూశారు. అంతేకాకుండా ఈ బాలుడు మమతను చూసి నవ్వడంతో ఎలాగైనా కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేసింది. బాలుడి తల్లితో చనువు పెంచుకుని అదును చూసి ఎత్తుకుని వెళ్లింది. బాలుడిని తీసుకుని వెళ్లిన జంట బాన్సువాడలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News