హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి ప్రభుత్వం అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్నది. ఇదే కోవలో, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సిఎంఒ) ‘వాట్సాప్ చానెల్’ను బుధవారం ప్రారంభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం సిఎంఒ నుండి వెలువడే ప్రకటనలను పౌరులకు చెరవేస్తుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయ వాట్సాప్ చానెల్ (Telangana CMO)ను వినియోగించుకోవడం ద్వారా సిఎం కెసిఆర్ వార్తలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.
ఆసక్తిగల వారు కింద సూచించిన పద్ధతిలో సిఎంఒ చానెల్‌లో చేరవచ్చు:
1. వాట్సాప్ అప్లికేషన్‌ను తెరవండి.
2. మొబైల్‌లో అయితే ‘Updates‘ అనే విభాగాన్ని ఎన్నుకోండి. డెస్క్‌టాప్ అయితే Channels ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
3. తర్వాత + బటన్ పైన క్లిక్ చేసి Find Channelsను ఎన్నుకోండి.
4. టెక్ట్‌బాక్స్‌లో ’Telangana CMO’ అని టైపు చేసి జాబితా నుండి చానెల్‌ను ఎన్నుకోండి. చానెల్ పేరు పక్కన ఒక ఆకుపచ్చని టిక్ మార్క్ (‘green tick mark’) ను నిర్ధారించుకోండి.
5. ‘Follow‘ బటన్‌ని క్లిక్ చేసి తెలంగాణ సిఎంఒ చానెల్‌లో చేరండి. సొఎంఒ పంపే ప్రకటనలను నేరుగా వాట్సాప్‌లోనే చూడండి.
పైన ఇచ్చిన QR Codeను స్కాన్ చేయడం ద్వారా కూడా తెలంగాణ సిఎంఒ వాట్సాప్ చానెల్‌లో పౌరులు చేరవచ్చు.
‘తెలంగాణ సిఎంఒ వాట్సాప్ చానెల్’ ను ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం (సిఎం పిఆర్‌ఒ) సమన్వయంతో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తున్నది.