Sunday, December 22, 2024

బైకును ఢీకొట్టిన కారు..

- Advertisement -
- Advertisement -

చింతపల్లి : కారు బైకును డీకొట్టిన ఘటనలో 5 గురు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గంలోని చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి గేటు సమీపంలో బుధవారం ప్రమాదం జరిగింది.ఎస్‌ఐ సతీష్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.దేవరకొండ నియోజక వర్గంలోని పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన మద్ది మడుగు ప్రసాద్ (38)తన బార్య మద్ది మడుగు రమణ(35)తన కుమారుడు మద్ది మడుగు అవినాష్ లు ద్విచక్రవాహనంపై హైదరాబాదు నుండి మల్లేపల్లి వైపుకు వెళ్తుండగా చింతపల్లి మండలంలోని కురంపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు వ్యక్తులు పట్నం మణిపాల్ (18),వనం మల్లికార్జున్,పులి పవన్ (18),వారాల మణివర్ధన్(18)లు కారులో మల్లేపల్లి కి వెళ్లి తిరిగి చింతపల్లి వైపుకు వెళ్తున్న క్రమంలో నసర్లపల్లి గేటు సమీపంలో కి రాగానే ప్రమాదవశాత్తు కారు టైరు పేలడంతో ఎదురుగా వస్తున్న ద్వీచక్రవాహనాన్ని ఢీకొట్టి కారు ఫల్టీ కొట్టింది.

దీంతో ద్వీచక్ర వాహణంపై వెళ్తున్న మద్దిమడుగు ప్రసాద్ తన కుమారుడు మద్దిమడుగు అవినాష్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. భార్య మద్ది మడుగు రమణ, కారులో వెళ్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 5 గురిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ పట్నం మణిపాల్ దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు.మద్దిమడుగు రమణ ,వనం మల్లిఖార్జున్ లకు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గ మద్యలో మాల్‌లో వనం మల్లిఖార్జున్ మృతి చెందగా,మద్ది మడుగు రమణ ఔటర్ రింగ్‌రోడ్డు వద్దకు వెళ్లగానే ఆమె మృతి చెందింది.ఇరువురుకి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్‌ఐ సతీషరెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News