మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా రిజ ర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నా నని మంత్రి కేటిఆర్ అన్నారు. మహిళలు రాజకీ యా ల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయ న అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని మాదా పూర్‌లో అంతర్జాతీయ టెక్‌పార్క్‌ను మంత్రి కెటి ఆర్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోటాలో తన సీటు వదు లుకోవడానికి కూడా సిద్ధమే అని స్పష్టం చేయ డంతో అక్కడున్న మహిళలు పెద్దఎత్తున హర్ష ద్వానాలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నా అన్నారు. జీవితాలు చాలా చిన్నవని తన పాత్ర తాను పోషించానని పె ట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దే శంలో 40 శాతానికి పైగా ఫార్మా రంగం ఉత్ప త్తులు ఇక్కడ నుంచే వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు అం డగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మారుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు.
హైదరాబాద్ చాలా అందమైన నగమని ఇక్కడ టాలెంట్‌కు కొరత లేదన్నారు. ఇతర దేశాలతో పోలిస్తేఇక్కడ ఖర్చు కూడా తక్కువే అని అన్నారు.పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి స్పష్టం చేశారు.హైదరాబాద్ ప్రపంచ స్థాయి వ్యాపార పార్కులు,డేటా సెంటర్‌ల అభివృద్ది చేసేందుకు సిఎల్‌ఐ ( క్యాపిల్యాండ్ ఇండియా ట్రస్టు)గ్లోబల్ కార్పోరేషన్‌లకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారడంతో కంపెనీలు అభివృద్ది చేసేందుకు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని మంత్రి కేటిఆర్ అన్నారు. హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు తామ సిఎల్‌ఐ వంటి సంస్థలతో కలిసి పని చేస్తామన్నారు.దేశంలో సిఎల్‌ఐ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కటని మాకు ఇక్కడ 30 సంవత్సరాల అనుభవం ఉన్నట్లు సిఎల్‌ఐ ఇండియా సీఈవో ఎంఆర్ సంజీవ్ దాస్‌గుప్తా అన్నారు. ప్రస్తుతం దేశంలోని ఆరు నగరాల్లో12 బిజెనెస్ పార్కులు ఉండగా హైదరాబాద్‌లోనే మూడు ఉన్నట్లు తెలిపారు. దేశంలో 90 శాతం ఆక్యుపెన్సీ రేటును సాధించామని, విదేశీ, స్వదేశీ ఉద్యోగులు ఒక లక్షా 50 వేల మంది నిపుణులు పని చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీశాఖ చీఫ్ రిలేషన్ ఆఫీసర్ అమర్‌నాథ్ రెడ్డి, సిఎల్‌ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మనోహర్ ఖియాతాని తదితరులు పాల్గొన్నారు.