- Advertisement -
న్యూఢిల్లీ : నీట్ పిజి 2023 కటాఫ్ మార్కులను అన్ని విభాగాలకు సంబంధించి జీరో స్థాయికి తగ్గిస్తూ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు వెలువరించింది. క్వాలిఫైయింగ్ శాతం విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో నీట్ పిజి 2023 ఎగ్జామ్‌కు హాజరైన అభ్యర్థులు ఈ వెసులుబాటుతో ఇక కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. అర్హత శాతం విషయంలో మెడికల్ /డెంటల్ కోర్సుల నీటి పిజి సంబంధిత అంశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు , దీని మేరకు పిజి కోర్సులకు సంబంధించిరౌండ్ 3 కోసం తాజాగా పేర్ల నమోదు, విభాగాల ఎంపికకు దిగవచ్చునని ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు నీట్ పిజికి హాజరైన వారు దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చునని వివరించారు.
- Advertisement -