- Advertisement -
బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా(58) మృతి చెందారు. ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అఖిల్ మిశ్రా మరణించారు. దీంతో బాలీవుడ్‌లో విషాదం ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఓ మూవీ షూటింగ్ లో పాల్గొన్న మిశ్రా.. ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి కిందపడి చనిపోయినట్లు తెలుస్తోంది. షూటింగ్ కు సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. కాగా, అఖిల్ మిశ్రా పలు బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలతోపాటు టివి సీరియల్లోనూ నటించి గుర్తింపు పొందారు. 2011లో జర్మన్ నటి సుజానే బెర్నార్ట్ ను అఖిల్ మిశ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
- Advertisement -