- Advertisement -
చండీగఢ్: జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఐఎ) వాంటెడ్ లిస్టులో ఉన్న పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సుఖా దునేకా కెనడాలో బుధవారం రెండు గ్యాంగుల మధ్య జరిగిన కాల్పుల పోరులో మరణించినట్లు పంజాబ్ పోలీసు అధికారులు తెలిపారు. కెనడాలో జరుగుతున్న ఖలిస్తానీ ఆందోళనతో కుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖా దునేకాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పంజాబ్‌లోని దేవీందర్ బంబిహా గ్యాంకు సభ్యుడైన దునేకా ఫోర్జరీ పత్రాలతో 2017లో కెనడాకు పారిపోయాడు. దునేకా అక్రమ ఆస్తుల వివరాలు కోరుతూ ఎన్‌ఐఎ బుధవారం విడుదల చేసిన 43 మంది గ్యాంగ్‌స్టర్ల జాబితాలో సుఖా దునేకా పేరు కూమా ఉంది. జూన్ 18న కెనడాలో ఖలిస్తానీ నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన తీరులోనే బుధవారం రాత్రి దునేకా హత్య జరిగింది.
- Advertisement -