- Advertisement -
న్యూఢిల్లీ : ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రంగా ఖండించింది. అవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే అని తోసిపుచ్చింది. ఉగ్రవాదులు, అతివాదులకు కెనడా సురక్షిత స్వర్గథామంగా మారిందని దుయ్యబట్టింది. ఇక భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్ల వీసా దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయలేక పోతున్నామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.
- Advertisement -