మన తెలంగాణ / హైదరాబాద్ : బ్యాంకింగ్ నియామక పరీక్షలకు హాజరయ్యే ఎస్టి, ఎస్సి, బిసి అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఐబిపిఎస్ నిర్వహించే ఈ పరీక్షలకు సిద్ధమయ్యే తెలంగాణా రాష్ట్రానికి చెందిన పై వర్గాల అభ్యర్థులకు అవసరమయ్యే శిక్షణను 60 రోజులు ఉచితంగా ఇచ్చుటకు పిఈటిసి హైదరాబాద్ లో ఏర్పాట్లు చేసింది ఎస్సి, ఎస్టి, బిసి అభ్యర్థుల డిగ్రీ ఆధారంగా ఎస్టిలకు -75, ఎస్సిలకు 15, బిసిలకు -10 చొప్పున మొత్తం 100 మంది అభ్యర్థులకు అక్టోబర్ 16వ తేదీ నుండి శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.
శిక్షణ పొందేందుకు ఆన్ లైన్ లో http://studycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వార దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులు అక్టోబర్ 3వ తేదీగా పేర్కొన్నారు. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునే తెలంగాణ అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 040 -27540104 నెంబరుకు అన్నిపని దినాలలో కార్యాలయ పనివేళల్లో సంప్రదించ వచ్చని పేర్కొన్నారు.