Tuesday, December 24, 2024

బడా గణేష్ వద్ద పోకిరీలు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఖైరతాబాద్ వినాయకుడి వద్ద మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించిన 55మంది పోకిరీలను హైదరాబాద్ షీటీమ్స్ అరెస్టు చేశారు. వినాయక చవితి కావడంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో షీటీమ్స్ మఫ్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున మహిళా భక్తులు వస్తుంటారు. దీంతో ఇక్కడ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. మహిళా భక్తులను పోకిరీలు వేధిస్తున్నట్లు తెలియడంతో వెంటనే అక్కడికి వెళ్లిన షీటీమ్స్ కొందరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరి కొంతమందిని సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి అసభ్యంగా ప్రవర్తించిన వారిని గుర్తించి అరెస్టు చేశారు. మూడు రోజుల్లోనే 55మంది పోకిరీలను పట్టుకున్నారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పోకిరీలు అడ్వాన్‌టేజ్‌గా తీసుకుని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.వారికి ఎక్కడ పడితే అక్కడ తాకడం చేశారు. వీటిని పరిశీలించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అలాగే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శ్యాం బిహారి మహతో ఖైరతాబాద్ గణేష్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడిని తనిఖీ చేయగా నాలుగు మొబైల్ ఫోన్లు లభించాయి. వినాయకుడి దర్శనానికి వస్తున్న భక్తుల మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు విచారణలో చెప్పాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళలు,యువతులు వేధింపులు ఎదుర్కొంటే వెంటనే షీటీమ్స్ వాట్సాప్‌నంబర్ 9490616555కు లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News