Tuesday, January 21, 2025

ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య నియామకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ నూతన చైర్మన్, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా మెదక్‌కు చెందిన బక్కి వెంకటయ్య (ఎస్‌సి, మాల)ను, ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించారు. కమిషన్ సభ్యులుగా కుస్రం నీలాదేవి (ఎస్‌టి, గోండు , ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (ఎస్‌టి, లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ(ఎస్‌సి, మాదిగ, కరీంనగర్), శంకర్ ( ఎస్‌సి, మాదిగ,నల్గొండ జిల్లా), రేణికుంట ప్రవీణ్ (ఎస్‌సి, మాదిగ, ఆదిలాబాద్) లను నియమించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ళ శ్రీనివాస్ పనిచేశారు. ఆయన పదవీ కాలం 2021లో ముగిసింది. అప్పటి నుండి ఆ పదవి ఖాళీగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News