డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబీషేక్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెం3 గా రూపొందనున్న యూనిక్ ఎంటర్ టైనర్ ‘ప్రీవెడ్డింగ్ ప్రసాద్’ ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ‘జబర్‌దస్త్’, బిగ్ బాస్ షోల తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి క్లాప్ నిచ్చారు. కోన వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, కోదండ రామిరెడ్డి, కోన వెంకట్, సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. చిత్ర దర్శకుడు రాకేష్ దుబాసి ముహూర్తపు సన్నివేశానికి స్వయంగా దర్శకత్వం వహించారు. దర్శకుడు సాయి రాజేష్ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సినిమా లాంచింగ్ ఈవెంట్ లో నబిషేక్ మాట్లాడుతూ.. అవినాష్ హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ నెం3 గా ‘ప్రీవెడ్డింగ్ ప్రసాద్’ చిత్రాన్ని చేస్తున్నాం. ఇందులో సాయి కుమార్ గారితో పాటు సంగీత మరికొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రీవెడ్డింగ్ ప్రసాద్’ కథ అద్భుతంగా వుంటుంది. స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా వుంటుంది. సన్నివేశాలు ఊహాతీతంగా వుంటాయి. ఇందులో అవినాస్ నే ఎందుకు హీరోగా తీసుకున్నామో సినిమా చూస్తున్నప్పుడు అర్ధమౌతుంది. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
వీరభద్రం చౌదరి మాట్లాడుతూ.. నబిషేక్ గారితో దిల్ వాలా సినిమా చేశాం. షూటింగ్ పూర్తయింది. అవినాష్ దిల్ వాలా లో చాలా మంచి పాత్ర చేశాడు. దర్శకుడికి, ప్రేక్షకులకు ఏం కావాలో తెలిసిన నటుడు అవినాష్, ఈ కథ నబిషేక్ గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది. పాయింట్ చాలా అద్భుతంగా వుంటుంది. అవినాష్ తప్పకుండా మంచి హీరో అవుతాడనే నమ్మకం వుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
అవినాష్ మాట్లాడుతూ.. నబిషేక్ గారికి జీవితాంతం రుణపడి వుంటాను. జబర్‌దస్త్, బిగ్ బాస్ షోలలో బుల్లితెర ప్రేక్షకులు నన్ను సపోర్ట్ చేశారు. నబిషేక్ గారు నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. ‘ప్రీవెడ్డింగ్ ప్రసాద్’ టైటిల్ చెప్పగానే చాలా మంది నవ్వుకున్నారు. సినిమాలో కూడా నవ్వుకుంటారు, భయపడతారు, థ్రిల్ అవుతారు.. ఇలా అన్ని డిఫరెంట్ షేడ్స్ ఇందులో వున్నాయి. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది. మీ సపోర్ట్ కావాలి” అని కోరారు
దర్శకుడు రాకేష్. మాట్లాడుతూ. ఇంతమంచి అవకాశం అవకాశ ఇచ్చిన నిర్మాత నబిషేక్ గారికి ధన్యవాదాలు. ఆయన లాంటి నిర్మాత వుంటే యువ ప్రతిభ పరిశ్రమలోకి వస్తుంది. ప్రీవెడ్డింగ్ ప్రసాద్ కథ అద్భుతంగా వచ్చింది. ఇందులో కథే హీరో. చాలా మంచి సబ్జెక్ట్. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తునారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.