- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఖైరతాబాద్ గణేషుడిని మొత్తం 2 లక్షల మంది భక్తులు ఇప్పటివరకు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ భారీ గణేషుడిని చూసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం వస్తుంటారు. ఇక ఈ ఏడాది 63 ఫీట్ల భారీ వినాయకుడు ‘దశ మహా విద్యా గణపతి’గా ఈ ఏడాది భక్తులను కనువిందు చేస్తున్నారు. మూడు నెలలుగా ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన కళాకారులు ఈ ఉత్సవాన్ని తయారు చేయగా విగ్రహం 55 టన్నులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
- Advertisement -