Sunday, January 19, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

ప్లాస్టిక్‌ని నియంత్రిద్దాం…పర్యావరణాన్ని కాపాడుకుందాం…

మన తెలంగాణ/హైదరాబాద్ : మాదాపూర్ పరిధిలోని గణేష్ నిమజ్జన ప్రదేశంలో రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగిన పల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మాదాపూర్ సిఐ తిరుపతి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకలను నియంత్రించే దిశగా అవగాహన సదస్సును శుక్రవారం ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌కి బదులు అందరు జూట్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ వాడాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్‌ని పంచి అందరిలో ఒక అవగాహనని తీసుకొచ్చే దిశగా అందరం పని చెయ్యాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవలసిన భాద్యత మన మీద ఎంతయినా ఉందన్నారు. ఎంపి సంతోష్ మొక్కలు నాటే కార్యక్రమం కానీ, ప్లాస్టిక్‌ని నియంత్రించే విధంగా చేపట్టే కార్యక్రమాలు రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రవికిరణ్, ఎస్‌ఐ వెంకటేష్, ఎస్‌ఐ ఇక్బాల్, డిఐ వెంకట్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో పోతుగల్ గ్రామస్తులు
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వెన్నమనేని శ్రీనివాస్‌రావు పుట్టినరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం, పోతుగల్ గ్రామంలో సర్పంచ్ అధ్వర్యంలో గ్రామస్తులు 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్ చేపట్టిన కార్యక్రమం గొప్పదని కొనియాడారు. ప్రతి ఒక్కరూ గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.

Green India 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News