Saturday, November 23, 2024

అసమ్మతిపై తారక మంత్రం

- Advertisement -
- Advertisement -

కడియం, రాజయ్య మధ్య కుదిరిన సయోధ్య

మనతెలంగాణ/హైదరాబాద్ : స్టేషన్ ఘన్‌పూర్ బిఆర్‌ఎస్ అసెంబ్లీ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య, ఎంఎల్‌సి కడియం శ్రీహరి మ ధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. వీరిద్ధరి మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మం త్రి కె.టి.రామారావు సయోధ్య కుదిర్చారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌తో రాజయ్య, కడియం శ్రీహరి భేటీ అ య్యారు. భేటీలో ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. రాజయ్యకు సముచిత స్థానం ఇస్తామని కెటిఆర్ హామీ ఇవ్వడంతో కడియంకు రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కడియం శ్రీహరి గెలుపునకు పనిచేస్తానని చెప్పారు. రాను న్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ టికెట్ కడి యం శ్రీహరికి దక్కటంతో రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎలాగైనా మ రోసారి టిక్కెట్ తనదేనని ధీమాగా ఉన్న రాజయ్యకు.. అధిష్ఠాన నిర్ణయం అశనిపా తం అయింది. తీవ్ర ఆవేదనతో నియోజకవర్గానికి వచ్చీ రాగానే.. కార్యకర్తల ముం దు బోరున విలపించారు. టిక్కెట్ పొందిన తరువాత.. నియోజకవర్గంలో కడియం శ్రీ హరి భారీ సభ నిర్వహించారు. ఆ సభకు రావాల్సిందిగా కడియం, పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజయ్యను ఆహ్వానించినా.. ఆయన ముఖం చాటేశారు. ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ ఇద్దరి నేతలతో కెటిఆర్ మాట్లాడి నచ్చజెప్పడంతో ఇరువురు నేతలు ఒక్కటయ్యారు. రానున్న ఎన్నికల్లో కడియం గెలుపు కోసం పాటుపడతానని రాజయ్య ప్రకటించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని సమావేశం అనంతరం ఇద్దరు నేతలు వెల్లడించారు. ఇరువురి నాయకులు కలిసిపోవడంతో నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ కార్యకర్తల్లో జోష్ నెలకొంది.

కెటిఆర్‌ను కలిసిన ఏపూరి సోమన్న.. త్వరలో బిఆర్‌ఎస్‌లోకి…
ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న త్వరలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావును శుక్రవారం ఏపూరి సోమన్న మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరాలన్న ఏపూరి సోమన్న నిర్ణయాన్ని మంత్రి కెటిఆర్ స్వాగతించారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎంఎల్‌ఎ బాల్క సుమన్, ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.

ప్రజాగాయకుడిగా ఏపూరిది తనదైన ముద్ర
తెలంగాణలో ఏపూరి సోమన్నకు ప్రజాగాయకుడిగా తనదైన ముద్ర ఉంది. ఏపూరి తెలంగాణ పాటలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రస్తుత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి దగ్గరి అనుచరుడిగా పనిచేశారు. తర్వాత ఆయన ఒంటెద్దు పోకడలు నచ్చక వైఎస్ షర్మిల ప్రారంభించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. అనంతరం షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా బిఆర్‌ఎస్ చేరాలని నిర్ణయించుకున్న ఏపూరి సోమన్న, ఆ మేరకు కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News