Sunday, January 19, 2025

వన్డే వరల్డ్‌కప్‌: ఉప్పల్ స్టేడియంలో పాక్ మ్యాచ్‌లు

- Advertisement -
- Advertisement -

లాహోర్: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను ఎంపిక చేశారు. ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టును పిసిబి సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఇంజమామ్ ఉల్ హక్ శుక్రవారం ప్రకటించాడు. హసన్ అలీని జట్టులోకి తీసుకున్నారు. ఆసియాకప్‌లో గాయపడిన నసీమ్ షాకు జట్టులో చోటు దక్కలేదు. బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. షాదాబ్ ఖాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫిక్, సల్మాన్ అలీ ఆఘా, మహ్మద్ వసీం జూనియర్, ఉసామా మీర్ తదితరులు జట్టులో చోటు సంపాదించారు. కాగా, వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ హైదరాబాద్ వేదికగా రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. అంతేగాక పాకిస్థాన్ ఆడే పలు ప్రపంచకప్ మ్యాచ్‌లకు కూడా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలువనుంది.

జట్టు వివరాలు:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫిక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకిల్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, షహీన్ అఫ్రిది, వసీం జూనియర్, హసన్ అలీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News