Monday, December 23, 2024

ఎన్నికల సన్నాహక సమావేశంలో మోట కొండూరు తహశీల్దార్ కు గుండెపోటు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి బ్యూరో/మోటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో నియోజకవర్గం స్థాయి ఎన్నికల సన్నాహాక సమావేశం జరుగుతుండగా మూటకొండూర్ తహసిల్దార్ శాంతిలాల్ నాయక్ స్పృహ తప్పిపోయి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక  ఆసుపత్రికి అధికారులు తరలించారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో ఎడమ చేతి భాగం పనిచేయడం లేదని ఆలేరు పిహెచ్ సి వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా శాంతి లాల్ నాయక్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News