చండీగఢ్: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద చండీగడ్, అమృత్‌సర్‌లోని ఖలిస్తానీ తీవ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్‌కు చెందిన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) జప్తు చేసింది. చండీగఢ్‌లోని సెక్టార్ 15లో ఉన్న పన్నున్ ఇంటి వెలుపల ఎన్‌ఐఎ జప్తు నోటీసు అతికించింది.
అదేవిధంగా సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జె అనే నిషిద్ధ సంస్థ వ్యవస్థాపకుడు కూడా అయిన గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ స్వగ్రామం అమృత్‌సర్‌లోని ఖాన్‌కోట్‌లో ఆయనకు చెందిన వ్యవసాయ భూమిని కూడా ఎన్‌ఐఎ జప్తు చేసుకుంది.జంజాబ్‌లోని మొహాలీలోని ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు ఉత్వర్వుల మేరకు తాము పన్నున్ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఆ నోటీసులలో ఎన్‌ఐఎ పేర్కొంది. 2020లో పన్నున్‌ను తీవ్రవాదిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఇదిలా ఉండగా..జూన్‌లో కెనడాలోని సర్రేలో హత్యకు గురైన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌కు చెందిన జలంధర్ జిల్లాలోని భర్‌సింగ్ పురా గ్రామంలోని అతని ఇంటి బయట కూడా జప్తు నోటీసును ఎన్‌ఐఎ అంటించింది.