- Advertisement -
వారణాసి : ఉత్తరప్రదేశ్‌లో కొవిడ్ మహమ్మారి ప్రభావంతో అనాధలైన కార్మికుల పిల్లల కోసం నిర్మించిన 16 రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రధాని మోడీ శనివారం ప్రారంభోత్సవం చేశారు. కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్షంతో అటల్ అవాసీయ విద్యాలయాస్ పేరున దాదాపు రూ. 1,115 కోట్లతో ఈ స్కూళ్లను నిర్మించారు. ఈ రెసిడెన్షియల్ స్కూళ్లను జాతికి అంకితం చేసే ముందు ప్రధాని మోడీ కొంతమంది విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. ఒక్కో పాఠశాలలో దాదాపు వెయ్యిమంది విద్యార్థులకు వసతి కల్పిస్తారు. ఒక్కో స్కూలును 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. తరగతిగదులు, ఆటస్థలం, రిక్రియేషన్ ప్రాంతాలు, మినీ ఆడిటోరియం, హాస్టల్ కాంప్లెక్సు, మెస్ సౌకర్యం తోపాటు సిబ్బందికి నివాసాలు కూడా ఏర్పాటయ్యాయి.
- Advertisement -