Saturday, November 23, 2024

గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. యాప్ డెవలపర్ల కోసం ఇండస్ యాప్ స్టోర్ పేరిట కొత్త వేదికను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ స్టోర్‌లో తమ అప్లికేషన్లను (యాప్స్) లిస్ట్ చేయాలని డెవలపర్లను కోరింది. 12 స్థానిక భాషల్లో ఈ యాప్ స్టోర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం యాప్ స్టోర్ల విషయంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫోన్‌పే వాటికి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఇండస్ యాప్ స్టోర్‌లో ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.www. indusappstore.com వెబ్‌సైట్ ద్వారా యాప్స్ ను అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. తొలి ఏడాది డెవలపర్ల నుంచి తాము ఎలాంటి ఫీజూ వసూలు చేయబోమని ఫోన్ పే తెలిపింది.

మరుసటి ఏడాది నుంచి స్వల్ప మొత్తంలో మాత్రమే ఫీజు తీసుకుంటామని పేర్కొంది. యాప్ డెవలపర్ల నుంచి ఎటువంటి ప్లాట్‌ఫామ్ ఫీజుగానీ, ఇన్-యాప్ పేమెంట్స్‌కు కమీషన్ గానీ వసూలు చేయబోమని స్పష్టంచేసింది. అలాగే, తమకు నచ్చిన పేమెంట్ గేట్‌వేను ఉచితంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.సాధారణంగా ఇన్ యాప్ పర్చేజీలపై గూగుల్, యాపిల్ స్టోర్లు 30 శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి. అలాగే, నచ్చిన పేమెం ట్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎంచుకోకుండా డెవలపర్లను నియంత్రిస్తున్నాయి. దీంతో వీటిపై యాప్ డెవలపర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సమస్యకు తమ ఇండస్ యాప్‌స్టోర్ ప్రత్యామ్నాయం కాగలదని ఫోన్‌పే చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆకాశ్ డోంగ్రే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News