- Advertisement -
నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మంత్ ఆఫ్ మధు. యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్‌తో పాటు కృషివ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ అచ్చు రాజమణి స్వరపరిచిన ‘ఓ నా మధు’ పాటను విడుదల చేశారు. ’ఓ నా మధు’ ప్రేమలోని అందమైన అనుభూతిని ప్రతిబింబించే చక్కటి మెలోడీ.
దర్శకుడు శ్రీకాంత్ నాగోతి స్వయంగా సాహిత్యం అందించగా, కార్తీక్, యామిని ఘంటసాల తమ మెస్మరైజింగ్ వాయిస్ తో అద్భుతంగా అలపించారు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి వండర్‌ఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- Advertisement -