- Advertisement -
బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు
మన తెలంగాణ / హైదరాబాద్: శ్రీవారి ఉచిత విద్యుత్ బస్సు చోరీ అయిన సంఘటన తిరుమలలో జరిగింది. ఉదయం 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సును చోరీ చేశారు. రూ.2 కోట్ల విలువైన బస్సును జిపిఎస్ కదలికల ద్వారా పోలీసులు పసిగట్టిన పోలీసులు. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద బస్సు ఉన్నట్లు గుర్తించి నాయుడు పేట పోలీసులను అప్రమత్తం చేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీసులు బస్సును స్వాధీనం చేసుకునే లోపు దొంగలు బస్సును అక్కడ వదిలేసి పారిపోయారు. తిరుమల రవాణశాఖ అధికారులు ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -