Tuesday, November 5, 2024

ఖైరతాబాద్ గణేషుడి వద్ద భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం పోటెత్తారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మధ్యాహ్నం వరకే లక్షమందికిపైగా భక్తులు దర్శించుకోవడంతో కమిటీ విఐపి దర్శనలను నిలిపివేశారు. ఈ నెల 28వ తేదీన ఖైరతాబాద్ గణేష్‌డి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఇది చివరి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకోవడానికి వచ్చారు.

భక్తుల రద్దీతో ఖైరతాబాద్ చౌరస్తా, మెట్రో స్టేషన్ పరిసరాలు కిటకిటలాడాయి. మధ్యాహ్నం దాటాక ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది. వేలాది మంది భక్తులు వస్తుండడంతో లకిడికాపూల్, ఖైరతాబాద్ పరిసరాల్లో వాహనాలను నిలిచి పోయాయి, వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను ఎప్పటికప్పుడు పంపించి వేశారు. భక్తులు దాదాపుగా మూడు కిలో మీటర్ల మేరకు దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్నారు.

దీంతో విఐపి దర్శనలను నిలిపివేసి సాధారణ భక్తులను అనుమతించారు. సాయంత్రం సమయంలో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. కాగా గణేషుడి విగ్రహాల నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వినాయకుడి విగ్రహాల నిమజ్జనాన్ని పరిశీలించారు. ఖైరతాబాద్, సోమాజిగూడ, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News