Saturday, November 23, 2024

పాస్‌బుక్కుల్లో సవరణకు రూ.2 లక్షలు డిమాండ్

- Advertisement -
- Advertisement -

ఎసిబికి పట్టుబడిన తహసీల్దార్, ఆర్‌ఐలు

మన తెలంగాణ /ఆదిలాబాద్ ప్రతినిధి: పాసు బుక్కుల సవరణ కో సం రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన తహసీల్దార్, ఆర్‌ఐ ఎసిబి ఎసిబి అధికారులకు చిక్కన సంఘటన ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ కరీంనగర్ డిఎస్పి రమణమూర్తి తెలిపిన వివరాల మేరకు… మావలకు చెందిన బాధితుడు యతేంద్రనాథ్ యాదవ్ తన 14 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి నాలుగు పట్టా పాస్ పుస్తకా ల్లో సవరణల కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించారు. ఇందుకుగాను తహసీల్దార్ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు.

ముందుగా పన్నిన వ్యూహం ప్రకా రం ఆదివారం బాధితుడు యతేంద్రనాథ్ యాదవ్ తహసీల్దార్ కా ర్యాలయంలో ఆర్‌ఐకు సదరు మొత్తాన్ని అప్పజెప్తుండగా ఎసిబి అధికారులు వలపన్నీ పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన తహసీల్దార్ ఆరీఫా సుల్తానాతో పాటు ఆర్‌ఐలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదుతో పాటు కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తదుపరి విచారణ కోసం తరలించనున్నట్లు డిఎస్‌పి రమణమూర్తి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News