Monday, December 23, 2024

ఎంఎల్సీ నామినేషన్లను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కొత్త వివాదానికి తెరతీశారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర శాసన మండలికి బిఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్, కె సత్యనారాయణలను నామినేట్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ సోమవారం తిరస్కరించారు.

రాజ్యాంగంలోని 171(5) అధికరణ కింద ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని మాత్రమే శాసనమండలికి నామినేట్ చేయాలని, రాజకీయాలతో సంబంధం ఉన్న ఇటువంటి వ్యక్తులను ప్రతిపాదించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో గవర్నర్ సూచించారు. ఆగస్టులో టిఎస్ఆర్ఠీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించిన బిల్లుతోసహా వివిధ బిల్లులపై గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు  ఈ తాజా పరిణామంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News