Friday, December 20, 2024

కూతురే కొడుకై..

- Advertisement -
- Advertisement -

రుద్రంగి: కూతురే కొడుకై తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం (39) నిరుపేద కావడంతో కూలీ పని చేసుకుంటూ జీవించేవాడు. రెండు సంవత్సరాల క్రితం కిడ్నీలు పాడవడంతో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకునేవాడు. సోమవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే చికిత్స అందిస్తుండగా చనిపోయాడు.

భూమానందంకు ఇద్దరు కూతుళ్లే కావడంతో పెద్ద కూతురు వైష్ణవి తండ్రికి తలకొరివి పెట్టాల్సిం వచ్చింది. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోవడంతో ఇద్దరు కూతుళ్లు, భార్య లత గుండెల పగిలేలా రోధించారు. పెద్ద కూతురే కొడుకులా మారి తండ్రి చితికి నిప్పు పెట్టడం అంత్యక్రియలకు హాజరైన వారి హృదయాలను కలచివేసింది. మృతునికి భార్య లత, కూతుళ్ళు వైష్ణవి (డిగ్రీ ప్రథమ సంవత్సరం), కీర్తన (ఆరవ తరగతి) చదువుతున్నారు. భూమానందం కుటుంబ పరిస్థితి ఆర్థికంగా వెనుకబడటంతో ప్రజాప్రతినిధులు, దాతలు ఆర్థికంగా ఆదుకోవాలని ప్రజలు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News