Friday, December 20, 2024

స్వైర విహారం చేస్తున్న వీధి కుక్కలు..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా రోడ్ల పై వీధి కుక్కల సంచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. కుక్కల బారిన పడి ప్రమాదాలకు, గాయాల పాలవడమే కాకుండా వాహనదారల వెంట పడిన క్రమంలో ప్రమాదాలకు సైతం గురి కాక తప్పడం లేదు. జిల్లా కేంద్రమైనా సూర్యాపేట పురపాల సంఘ పరిధిలో సోమవారం రెండు చోట్ల వీధి కుక్కలు చిన్న పిల్లలను మొదలుకొని పెద్దల వరకు తీవ్రంగా గాయపర్చిన పరిస్థితి. ఇదే కాకుండా జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయ పల్లి గ్రామంలో నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు వీధి కుక్కల బారిన పడి గాయాలపాలైన పరిస్థితి అక్కడి ప్రజలకు ఎదురైన సంఘటన తెలిసిందే. సూర్యాపేట పట్టణం శ్రీరాం నగర్‌లో తెల్లవారుజామున మహిళ తీవ్ర గాయాలు కాగా 29వ వార్డు పరిధిలోని జర్నలిస్టు కాలనీలో మూడున్నర సంవత్సరాల బాలుడిని తీవ్రంగా గాయపరిచిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పట్టణ ప్రధాన వీధులే కాకుండా గల్లీలు, గ్రామాలలో ప్రజలు వీధి కుక్కల బారి నుంచి తప్పించుకోలేక పోతున్న పరిస్థితి.

కుక్కలను పట్టించే కార్యక్రమం నామమాత్రంగా సాగిస్తున్న అధికారులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తినప్పుడే ఆర్భాటాలతో కూడిన హంగామా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కుక్కలు రోడ్ల పై గుంపులు గుంపులుగా సంచరిస్తూ పాదాచారులను మొదలుకొని ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులే కాకుండా పెద్ద వాహనాల వెంట సైతం పడుతున్న క్రమంలో వాటి బారి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో కొత్త ప్రమాదాలకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకు మున్సిపల్, గ్రామ పంచాయితీల వారీగా తగిన చర్యలు తీసుకోవాలల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. కుక్కలను పట్టిస్తున్నామనే పేరుతో సాగిస్తున్న చర్యలను మరింత వేగవంతం చేసి వీధి కుక్కల సంఖ్యను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొని భయటికి రాలేని పరిస్థితి ఎదురవుతుందని ప్రజలు వాపోతున్నారు.

పట్టణ నడిబొడ్డు అలంకార్ రోడ్డులో వీధి కుక్కల గుంపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన గొద్ది గంటలకే జిల్లా కేంద్రంలో రెండు చోట్ల ఇరువురిని గాయపరిచిన దృశ్యం వెలుగు చూడగ, వెలుగు చూడని సంగతులు ఎన్నో, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News