Tuesday, November 26, 2024

గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం

- Advertisement -
- Advertisement -

టిఎస్‌ఎస్‌పిడడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ నెల 28 వ తేదీన నిర్వహించే గణేష్ విగ్రహాల శోభాయాత్ర మరియు నిమ్మజన కార్యక్రమం సజావుగా జరిగేందుకు గాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తగు ఏర్పాట్లు చేపట్టిందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి గారు తెలిపారు. గణేష్ విగ్రహాల నిమ్మజన కార్యక్రమం నిర్వహించే ముఖ్య ప్రాంతం హుసైన్ సాగర్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మార్గ్ మరియు ట్యాంక్ బండ్ కంట్రోల్ రూంలను ప్రారంభించిన సీఎండీ మాట్లాడుతూ.. నిమ్మజన కార్యక్రమంలో ఏర్పడే అదనపు లోడ్ లకు సరిపడా 500 కేవీఏ సామర్ధం కలిగిన 32 ట్రాన్స్‌ఫార్మర్లు, అదే విధంగా 315 కేవీఏ సామర్ధం ఉన్న 32 ట్రాన్స్‌ఫార్మర్లు, 160 కేవిఏ సామర్థం ఉన్న 27 ట్రాన్స్‌ఫార్మర్లు, ఏర్పాటు చేయడమే కాకుండా సుమారు 100 కిలో మీటర్ల పొడవు 11 కేవీ సామర్థం కలిగిన ఎల్‌టి కేబుల్‌ను, ఫోల్స్, కండక్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జె శ్రీనివాస రెడ్డి , డైరెక్టర్ ఆపరేషన్ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిర్వహించే నిమ్మజన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పర్యవేక్షిస్తారని సీఎండీ తెలిపారు. దీనికి తోడు ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతానికి ప్రాజెక్టు డైరక్టర్ టి. శ్రీనివాస్,ట్యాంక్ బండ్ ప్రాంతానికి ఆపరేషన్స్ డైరక్టర్ జె శ్రీనివాస రెడ్డి,బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్ కు సిహెచ్ మదన్ మోహన్ రావు (డైరెక్టర్ పి, ఎంఎం) ఐడిఎల్ చెరువు, రంగా రెడ్డి జోన్ ప్రాంతానికి కమర్షియల్ డైరక్టర్‌కే రాములు సరూర్ నగర్ చెరువు ప్రాంతానికి హెచ్‌ఆర్డ్ డైరక్టర్ జి పర్వతం , ఆడిట్ డైరక్టర్ గోపాలరావును చార్మినార్ ప్రాంతానికి, ఐపిసి డైరక్టర్ ఎస్. స్వామిరెడ్డిలు శోభయాత్రకు ఎటువంటి విద్యుత్ సమస్య రాకుండా పర్యవేక్షిస్తారన్నారు.

చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు తమ తమ జోనల్, సర్కిల్ పరిధులలో నిర్వహించే నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూంలతో పాటు, పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన జాయింట్ కంట్రోల్ రూంలలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు తమ పరిధిలోని పెద్ద విగ్రహాలు ప్రతిష్టించిన మండపాలను, ఆ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే వీధులను, రహదారులను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని, రోడ్ క్రాసింగ్లు, వదులుగా నున్న తీగలు సరి చేయటం, ట్రాన్సఫార్మర్ల వద్ద ఎర్తింగ్, అవరమైన చోట ఇన్సులేషన్ ఏర్పాటు, ఇనుప స్తంభాలు, ఫ్యూజ్ బాక్సులు వున్నచోట పివిసి పైపులు, ప్లాస్టిక్ షీట్ల ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రధానంగా విద్యుత్ భద్రత పై దృష్టి సారించాలని, శోభాయాత్రలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

అవాంఛనీయ పరిస్థితులు వుంటే వెంటనే తెలియ చేయాలి: సిఎండి
మండప నిర్వాహకులు, ప్రజలు విద్యుత్ భద్రత సూచనలు పాటిస్తూ ఎక్కడైనా అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు సమీపంలో నున్న విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ వారికి గాని, 100 / 1912 మరియు ట్యాంక్ బండ్ విద్యుత్ కంట్రోల్ నెంబర్ 7901530966 / ఎన్టీఆర్ మార్గ్ 7901530866 ద్వారా గాని, దీనికి తోడు సంస్థ మొబైల్ యాప్, ట్విట్టర్, పేస్ బుక్ వంటి ద్వారా కూడా తమ శాఖ వారికి తెలియజేయాలని సిఎండి రఘుమా రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో సిఎండి జి రఘుమా రెడ్డితో పాటు డైరక్టర్లు, సిజిఎంలు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News