Thursday, December 19, 2024

మంగళవారం రాశి ఫలాలు(26-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు.

వృషభం: యత్న కార్యసిద్ధి పొందుతారు. సంఘంలోని ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాలు,శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప ధన లాభాలు పొందుతారు.

మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన స్వల్ప వివాదాలు పరిష్కరించుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి.

కర్కాటకం: పాత మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుని ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.పాత బాకీలు వసూలు అవుతాయి.వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

సింహం: నూతన పరిచయాలు పెరుగుతాయి.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.భూవివాదాలు తీరీ నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.ఉద్యోగ, వివాహ యత్నాలు పలిస్తాయి.

కన్య: ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి సలహా పై నూతన కార్యక్రమాలు చేపడతారు.గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు, స్వల్ప ధన లాభాలు పొందుతారు.

తుల: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.శ్రమ తప్పకపోవచ్చు చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం: నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వస్తు లాభం పొందుతారు.

ధనస్సు: ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలలో పాల్గొని విజయం సాధిస్తారు. రాబడి పెరుగుతుంది. దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం: ముఖ్యమైన విషయ వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కుంభం: రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి, సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం: కుటుంబ సభ్యులను చిన్ననాటి స్నేహితులను కలిసి శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి పొందుతారు. వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్వల్ప ధన లాభాలు పొందుతారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News