- Advertisement -
బెంగళూరు: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ బెంగళూరులో మంగళవారం బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో బిలిగుండ్లు నుంచి 3,000 , క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు కర్నాటక విడుదల చేయాలని మంగళవారం జరిగిన చర్చల అనంతరం కావేరీ జల నియంత్రణ కమిటీ(సిడబ్లుఆర్‌సి) సిఫార్సు చేసింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 25 నియంత్రణ వరకు నీటి విడుదల జరగాలని కమిటీ సిఫార్సు చేసింది.
తమిళనాడుకు కావేరీ జలాల విడుదలకు వ్యతిరేకంగా కర్నాటక జల సంరక్షణ సమితి మంగళవారం బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 29 కర్నాటక వ్యాప్తంగా బంద్‌కు కూడా సమితి పిలుపునిచ్చింది.
- Advertisement -