- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమీషన్ల కోసమే అభివృద్ధి పనుల పేరిట మోసం చేస్తున్నారని రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రూ. 540 కోట్లతో మూసీ నదిపై వంతెనలకు మంత్రి శంకుస్థాపన చేసి టెండర్లు పిలువడం.. ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి పనిగా భావించలేమని, ఇది కేవలం కమీషన్ల కోసమేనని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ప్రతి పని కమీషన్ల కోసమే అని ఆయన విమర్శించారు.
- Advertisement -