Sunday, January 19, 2025

గ్రీన్ ఛాలెంజ్‌లో రక్షణశాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆయన దేశం గర్వించే శాస్త్రవేత్త, తన విజనరీ ఆలోచనలతో దేశానికి రక్షణ, అంతరిక్ష రంగంలో చారిత్రక విజయాలను అందించిన మేధావి, భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి మంగళవారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సికింద్రాబాద్‌లోని డాక్టర్ సైంటిస్ట్ హాస్టల్లో రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచంలో అన్నింటికంటే ప్రమాదకరమైనది కాలుష్యం మనిషి తన అవసరాల కోసం సృష్టించిన ప్లాస్టిక్, తయారు చేసిన వాహనాలు ఇవ్వాల యావత్ భూమండలాన్ని కల్లోలం చేస్తున్నాయన్నారు. దీని నుంచి మనిషి బయట పడటానికి లక్షల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. అంతేకాదు, కాలుష్యం సృష్టించిన విలయం వల్ల ప్రతి రెండు ఇళ్లలో ఒకరు హాస్పిటలో చేరాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కాలుష్యం అనేది ఒక్క గాలికి, నీరుకు సంబంధించిందో కాదు మన జీవిత ప్రయాణంలో ప్రతీ అంశంలో కాలుష్యం కల్లోలితం చేస్తుందని తెలిపారు. అందుకే లక్షల బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ వేరే గ్రహాల్లో జీవ అవకాశాలు కోసం పరిశోధిస్తున్నామన్నారు. ఈ సమస్యలన్నింటికి ఏకైక పరిష్కారం మొక్కలు నాటడమేనని వెల్లడించారు. ఆ పని గ్రీన్ ఇండి యా ఛాలెంజ్ ద్వారా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఎంపిసంతోష్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఎంపి సంతోష్ చేస్తున్న కృషిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములం కావల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ శాస్త్ర సాంకేతికరంగంలో భారత దేశం గర్వించే స్థానానికి చేరుకోవడంలో తనదైన పాత్ర పోషించిన సతీష్ రెడి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగం కావడం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. వారి స్పూర్తివంతమైన మాటలు అనేక మంది ని మొక్కలు నాటించే వైపుగా ఆలోచింప చేసేవిగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబెర్స్ రాఘవ, కరుణాకర్‌రెడ్డి, ఇతర సైంటిస్టులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ని నియంత్రిద్దాం.. పేపర్ బ్యాగ్స్ వాడుదాం..
బిగ్ బాస్ ఫెమ్, నటి ఇనాయ సుల్తానా
ఈ రోజు బేగంపేట్ ట్రాఫిక్ సిగ్నల్ పరిధిలో రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఇనాయ సుల్తానా ప్లాస్టిక్ వాడకాలను నియంత్రించే దిశగా అవగాహన సదస్సును ఏర్పాటు చెయ్యడం జరిగింది. ప్లాస్టిక్ కి బదులు అందరు జూట్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ వాడాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జూట్ బ్యాగ్స్ మరియు పేపర్ బ్యాగ్స్ ని పంచి అందరిలో ఒక అవగాహనని కల్పించే దిశగా పని చేస్తున్నారు అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవలసిన భాద్యత మన మీద ఎంతయినా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి మొక్కలు నాటే కార్యక్రమం కానీ ప్లాస్టిక్ ని నియంత్రించే విధంగా చేపట్టే కార్యక్రమాలు రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరము అన్నారు.ఇంతటి గొప్ప కార్యక్రమాలలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

‘చేయి చేయి కలుపుదాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం…’
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు హరితహారంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ అన్ని జైళ్లకు సంబంధించిన స్థలాల యందు మొక్కలు నాటే కార్యక్రమం లో బాగంగా మంగళవారం వికారాబాద్ ఖైదీల వ్యవసాయ క్షేత్రంలో 5000 మొక్కలు నాటే కార్యక్రమంను రాష్ట్రం హోం ప్రిన్సిపల్ కార్యదర్శి, జైళ్ల శాఖ డిజి జితేందర్ ప్రారంభించారు. చేయి చేయి కలుపుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తన సందేశంలో పేర్కొన్నా రు అలాగే ప్రకృతిని మనం కాపాడి భావి తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ తరఫున హరితహారం కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐజిలు రాజేష్ , మురళి బాబు, డిఐజిలు శ్రీనివాస్, సంపత్‌లతో పాటు వికారాబాద్ ఎస్‌పి కోటిరెడ్డి పాల్గొన్నారు. ఇంకా జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ లోని అధికారులం దరూ పాల్గొన్నారు. కార్యక్రమంను విజయవంతం చేసిన హైదరాబాద్ రేంజ్ డిఐజి శ్రీనివాస్, సబ్ జైళ్ల అధికారి రామచంద్రం, పరిగి జైల్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్‌లను డిజి జితేందర్ ప్రత్యేకంగా అభినందించారు.

Green-India-Challenge2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News