Monday, December 23, 2024

రేవంత్ రెడ్డపై సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ నేతపై వేటు

- Advertisement -
- Advertisement -

మహేశ్వరం కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డిపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై కొత్త మనోహర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి నుంచి రూ.10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని ఆయన ఆరోపించారు.

ఈ విషయం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు కూడా చెప్పారని, సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బైట పెడతానని మనోహర్ రెడ్డి, రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులపై తప్పడు ఆరోపణలు చేశాడని కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News