న్యూఢిల్లీ : భారత్‌కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీసుకొచ్చిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్‌ఐఎ) దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ సానుభూతిపరులుగ్యాంగ్‌స్టర్ల మధ్య ఉన్న బంధాన్ని తెంచే పనిలో నిమగ్నమైంది. ఈమేరకు ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.
పంజాబ్, హర్యానా, ఢిల్లీఎన్‌సిఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో 50 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. భారత్‌లో నియమించుకొన్న వ్యక్తులకు ఇతర దేశాల్లోని ఖలిస్థానీలుగ్యాంగ్‌స్టర్ల నుంచి హవాలా మార్గంలో డబ్బులు వస్తున్నాయని, వీటిని ఉపయోగించి వారు డ్రగ్స్, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని ఎన్‌ఐఎ వర్గాలు వెల్లడించాయి. వీరికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి సహకారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే యూఏపిఎ కింద అరెస్టు చేసిన వారి నుంచి ఈ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.
తాజాగా బుధవారం పంజాబ్‌లో 30 చోట్ల, రాజస్థాన్‌లో 13, హర్యానాలో నాలుగు చోట్ల , ఉత్తరాఖండ్‌లో రెండు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో చోట తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ నుంచి పారిపోయి యూకే, కెనడా, దుబాయ్, పాకిస్థాన్ ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న 19 మంది ఖలిస్థాన్ ఉగ్రవాదుల జాబితాను జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. దీంతోపాటు హర్విందర్ సింగ్ సంధు, లక్బిర్ సింగ్ సంధు పేరిట రూ. 10 లక్షలు చొప్పున రివార్డును కూడా ప్రకటించింది. వీరికి జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయి.