Friday, November 22, 2024

రాకెట్ లాంచర్ శకలంతో పిల్లలు ఆడుతుండగా పేలింది…

- Advertisement -
- Advertisement -

కరాచీ: పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కాంద్‌కోట్‌లో బుధవారం పిల్లలు ఆడుకుంటూ ఇంట్లోకి తెచ్చిన రాకెట్ లాంచర్ శకలం పేలిపోవడంతో ఓ కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిల్లలు ఇంటి బయట ఆడుకుంటుండగా, రాకెట్ లాంచర్ శకలం వారి కంటపడిందని, దానిని వారు ఇంట్లోకి తీసుకొచ్చి ఆడుతుండగా ఒక్కసారిగా పేలిపోయిందని కష్మోర్‌కాంధ్‌కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి ) రొహిల్ ఖొసా చెప్పారు.

ఇదీ నదీతీర ప్రాంతమని, ఇక్కడ బందిపోటు దొంగలు దాక్కుంటుంటారని, వారు రాకెట్ లాంచర్ శకలాన్ని విడిచిపెట్టి ఉంటారని ఖొసా అభిప్రాయపడ్డారు. కాంధ్‌కోట్ సివిల్ ఆస్పత్రి ఏరియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సింధ్, పంజాబ్ లోని నదీతీర ప్రాంతం అనేక నేరగాళ్ల ముఠాలకు స్వర్గంగా మారిందని, అలాంటి వారికి చోటు లేకుండా ఆ పాంతాలను రక్షించాలని పాక్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ , మాజీ విదేశాంగ మంత్రి బిల్వాల్ భుట్టో జర్దాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింధ్ ముఖ్యమంత్రి జస్టిస్ మక్‌బూల్ బకర్ ఈ ప్రమాదానికి కారణమైన రాకెట్ లాంచర్ ఆ ప్రదేశాలకు ఎలా చేరిందో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ప్రావిన్షియల్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News