- Advertisement -
హైదరాబాద్ : ‘ మిలాద్ ఉన్ నబీ’ పండుగ (సెప్టెంబర్ 28)ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ ప్రపంచ శాంతి స్థాపన కోసం మహమ్మద్‌ను చివరి ప్రవక్తగా నియమించాడని ముస్లింలు భావిస్తారని, మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు అని సిఎం కెసిఆర్ అన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన శాంతి, కరుణ, ధార్మిక చింతన, దాతృత్వం, ఐకమత్యం, సర్వ మానవ సమానత్వం ప్రపంచమంతా వెల్లివిరియాలని సిఎం ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీ ప్రజల సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని సిఎం తెలిపారు.‘తెలంగాణలో గంగా జమున తహజీబ్’ పరిరక్షణకు తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
- Advertisement -