Friday, November 15, 2024

పోలవరం బ్యాక్ వాటర్‌పై చర్యలు తీసుకొండి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపైన పోలవరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర పరిధిలో కొంత మేర ముంపు సమస్య ఏర్పడుతున్నందున ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినింది. ఏపీపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో అభ్యంతరాలను పట్టించుకోవడం లేదంటూ కేంద్ర జలసంఘం చైర్మన్‌కు రాష్ట్రనీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ బుధవారం లేఖ రాశారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో 954 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని లేఖలో వివరించారు. గతంలో తాము పోలవరం అథారిటీ సమావేశాల్లో

వివరించిన తొమ్మిది అంశాల్లో ఏ ఒక్కదానిపైకూడా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఈఎన్‌సీ పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి సమన్వయం లోపం ఉందని లేఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. సుప్రీంకోర్టులో కేంద్రం నివేదించినట్లు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం తెలిపింది.ఈ అంశాల్లో పోలవరం అథారిటీ ఇచ్చిన హామీలు కూడా కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోతున్నాయని తెలిపింది. సీడబ్ల్యూసీ, పీపీఏ భేటీల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంలో తక్షణమే చర్యలు చేపట్టాలని జల సంఘాన్ని కోరూతూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News