Tuesday, April 1, 2025

వట్టెం భూ నిర్వాసితుడిని ఆదుకోవాలి : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వట్టెం ప్రాజెక్టు భూనిర్వాసితుడు, ఆత్మహత్య చేసుకున్న ఆల్లోజి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. బుధవారం కొమ్మర గ్రామంలో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వట్టెం రిజర్వాయర్ కింద అనుకున్న దానికంటే ఎక్కువ భూమి సేకరణ చేస్తున్నారు. భూ నిర్వాసితుడు జంగయ్య కొడుకు మల్లేశం మూడు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య అనిత, పిల్లలు మౌనిక కార్తీక్ అనాధలుగా మిగిలారు. మళ్లీ ఇప్పుడు అల్లోజి ఆత్మహత్య చేసుకున్నారు. కొమ్మర గ్రామంలో ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వానికి మన వాడలలో అడుగుపెట్టే హక్కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజల కోర్టులో దీన్ని పెడతాం అక్కడే తేల్చుకుంటాం అని ఈటల వెల్లడించారుఉ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News