Sunday, January 19, 2025

జనసేనకు స్టంట్ మేన్ శ్రీ బద్రి విరాళం..

- Advertisement -
- Advertisement -

సినిమాల్లో కార్లను పల్టీలు కొట్టిస్తూ చేసే డేర్ డెవిల్ స్టంట్స్ ఎంతో కష్ట సాధ్యమైనవని, సాహసంతో కూడుకున్నవనీ, తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి స్టంట్స్ చేయడం శ్రీ బద్రికి మాత్రమే సాధ్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచి శ్రీ బద్రితో పరిచయం ఉందన్నారు. భోళాశంకర్ చిత్రంలో చేసిన స్టంట్స్ కి ఆయన్ని అభినందించారు. బుధవారం సాయంత్రం స్టంట్ మేన్ శ్రీ బద్రి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. భోళాశంకర్ చిత్రంలో చేసిన స్టంట్స్ కిగాను తాను అందుకున్న పారితోషికం రూ.50 వేలు జనసేన పార్టీకి విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, శ్రీ బద్రికి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం శ్రీ బద్రి మాట్లాడుతూ.. “28 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయమే నన్ను నిలబెట్టింది. సార్ చేసే సాయం నాతో ఆగిపోకూడదు. ఎందరికో ఆయన సాయం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే నాలాంటి ఎంతో మందికి అండగా నిలుస్తారు. ఆ ఆకాంక్షతోనే భోళాశంకర్ చిత్రానికి వచ్చిన పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాను” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News