Monday, December 23, 2024

టికెట్లు అమ్ముకున్న వాళ్లు రాష్ట్రాన్ని అమ్ముకుంటారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

వరంగల్: జిల్లాకు ఒక మెడికల్ దేశంలో ఎక్కడా లేదని, నర్సంపేటలో మెడికల్ కాలేజీ రావడం ఇక్కడి ప్రజల అదృష్టమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీ కోసం భూమిపూజ చేసి, గృహలక్ష్మి, దళిత బంధు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రొసీడింగ్స్ ను ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు లబ్దిదారులకు పంపిణీ చేశారు. మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1
డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నంబర్ 1గా ఉందని ప్రశంసించారు. కాళేశ్వరం, పాలమూరుతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, ఇక్కడి చెరువులు నిండుగా చేసుకున్నామని, దేవాదుల నీళ్ళు తెస్తా అని పెద్ది సుదర్శన్ అంటే, నాడు కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటామన్నారని, కెసిఆర్ చెబితే మాట తప్పుడు, చేసి చూపించారని హరీష్ రావు మెచ్చుకున్నారు.

కాంగ్రెస్ హయాంలో సర్కారు తుమ్మలు తప్ప నీళ్ళు రాలేదని, నర్సంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని, తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉందని, నిరంతర కరెంట్ ఇవ్వడంలో నెంబర్ వన్,
రైతు బంధు ఇవ్వడంలో నెంబర్ వన్ గా ఉందని, కాంగ్రెస్ హయాంలో మూడు ధర్నాలు ఆరు అరెస్టులతో విజృంభిస్తోందని, మెడికల్ కాలేజీ, చదువుతో పాటు వైద్యం అందుబాటులోకి వస్తుందని, ఎంజిఎం లాంటి ఆసుపత్రి నర్సంపేటకు వచ్చిందని ఆయన మెచ్చుకున్నారు.

150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారని, నాడు డాక్టర్ చేయాలంటే విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు జిల్లాల్లో ఉంటూనే ఇంటి వద్ద ఉంటూనే చదువచ్చని, ఎల్ కె జి ఫీజు కంటే డాక్టర్ విద్యను తక్కువ డబ్బులకు అందిస్తున్నామని, కేవలం ఏడాదికి 10 వేల ఫీజుతో ఎంబిబిఎస్ చదువుతున్నారని ప్రశంసించారు. భారత్ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లతో టాప్ లో తెలంగాణ ఉందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చత్తీస్ గడ్, కర్ణాటకలలో 600 పింఛన్ ఎందుకు ఇస్తున్నారని హరీష్ రావు అడిగారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా అక్కడ ఇచ్చి ఇక్కడ మాట్లాడాలని, కన్నతల్లికి అన్నం పెట్టనొడు, పినతల్లికి బంగారు గాజులు ఇస్తాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ జైత్ర యాత్ర లేదా కేసీఆర్ శవ యాత్ర అని కెసిఅర్ అన్నాడని, ఎపి రాష్ట్రంలో వెళ్తున్న అని చెప్పి తెలంగాణ సాధించి చూపెట్టారని, కాంగ్రెస్ వాళ్ళు వస్తే 6 గ్యారెంటీలు కాదు, ఆరుగురు ముఖ్యమంత్రులు వస్తారని, మత కలహాలు, కొట్లాటలు వస్తాయని హెచ్చరించారు. 10 కోట్ల రూపాయలకు పిసిసి అధ్యక్షుడు టికెట్ అమ్ముకున్నరని ఓ కాంగ్రెస్ నాయకుడు అన్నారని, అధికారం కోసం ఎన్ని కుట్రలు అయినా చేస్తారని హరీష్ రావు విమర్శించారు. టికెట్లు అమ్ముకున్న వాళ్ళు రాష్ట్రాన్ని అమ్ముకుంటారని, బిజెపి, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బిఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News