న్యూఢిల్లీ :ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల హత్యతో ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ ఎస్‌ఎస్పీ రాకేశ్ బల్వాల్‌ను తన సొంత కేడర్ అయిన మణిపూర్‌కు బదిలీ చేసింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అల్లర్ల కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పుల్వామా దాడిని దర్యాప్తు చేసిన రాకేశ్…
రాజస్థాన్‌కు చెందిన రాకేశ్ బల్వాల్ 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మణిపూర్ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, 2018 లో ఎన్‌ఐఎలో ఎస్పీగా పదోన్నతి పొందారు. 2019లో పుల్వామాలో జరిగిన భీకర ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను దర్యాప్తు చేసిన ఎన్‌ఐఎ బృందంలో రాకేశ్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత 2021 డిసెంబరులో పదోన్నతిపై ఎజిఎంయుటి (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాలు) కేడర్‌కు బదిలీ అయ్యారు. శ్రీనగర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా మణిపూర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయనను తిరిగి సొంత కేడర్‌కు పంపించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. తాజాగా దీనిపై ఉత్తర్వులు వెలువడ్డాయి. మణిపూర్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ వర్గాలు వెల్లడించా