Monday, December 23, 2024

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం : సిఐ కోటేశ్వర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్లాస్టిక్‌ని నియంత్రిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.. అని మల్యాల సిఐ కోటేశ్వర్ అన్నారు. గురువారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ప్లాస్టిక్ వాడకాలను నియంత్రించే దిశగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కి బదులు అందరు జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ వాడాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జూట్ బ్యాగ్స్‌ని సిఐ కోటేశ్వర్ అందజేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంపి సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ప్లాస్టిక్ ని నియంత్రించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సిఐ అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్ కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అశోక్, కొండగట్టు గుడి ఈఓ వెంకటేశ్, ఎఈఓ శ్రీనివాస్, సునీల్ , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇన్‌ఛార్జ్ గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలను నాటిన చిన్నారి…
సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండల కేంద్రంలో చిన్నారి కొనుకటి ఆద్య రెడ్డి మొక్కలను నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గురువారం తన పుట్టినరోజు సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో ఆద్య రెడ్డి మొక్కలను నాటారు. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు.

Adya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News