Monday, November 25, 2024

ప్రగతి పరుగులు

- Advertisement -
- Advertisement -

పారిశ్రామిక అనుకూల విధానాలు, సమర్థ నాయకత్వంతో అభివృద్ధి

రూ. 1200 కోట్ల తన తయారీ కేంద్రానికి కిటెక్స్ శంకుస్థాపన

మన తెలంగాణ/ హైదరాబాద్/ షాబాద్ : దేశంలో తెలంగాణ అభివృద్దిలో ముందు ఉందని, దానికి సమర్థ నాయత్వం వల్లే సాధ్యమైందని ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో కిటెక్స్ సంస్థ తన ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పారెల్ తయారీ క్లస్టర్ యూనిట్ ఏర్పాటుకు మంత్రి కేటిఆర్ కిటెక్స్ సంస్థ చైర్మన్ సాబు జేకబ్ తో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను భారీగా విస్తరించి, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన కిటెక్స్ సంస్థకి మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కిటెక్స్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని కేటీఆర్ తెలిపారు. కిటెక్స్ సంస్ధ తయారీ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రోజువారీగా ప్రపంచంలోనే అత్యధిక దుస్తులను ఉత్పత్తి చేస్తున్న తయారీ ప్లాంట్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో నిలుస్తుందని కెటిఆర్ అన్నారు. కిటెక్స్ సంస్థ తన తయారీ క్లస్టర్ కోసం 1200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నది. ఈ క్లస్టర్ ఏర్పాటు తర్వాత ప్రతిరోజు ఏడు లక్షల దుస్తులను కిటెక్స్ సంస్థ ఉత్పత్తి చేయనున్నది. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి తయారీ కేంద్రం నిర్మాణం పూర్తి అవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కిటెక్స్ సంస్థ తెలిపింది. కిటెక్స్ సంస్థ ఇప్పటికే తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో తన భారీ తయారి యూనిట్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి వరంగల్ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు కిటెక్స్ తెలిపింది.

350 కోట్ల సింటెక్స్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కెటిఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు, అద్భుతమైన మౌలిక వసతుల వల్లనే అనేక సంస్థలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని ఈ సందర్భంగా కెటిఆర్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్రంలో తన సబ్సిడరీ సంస్థ అయిన సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమాన్ని సంస్థ ఛైర్మన్ బికె గోయంకాతో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా చందన్ వెల్లిలో సింటెక్స్ సంస్థ రూ.350 కోట్లతో తమ యూనిట్‌ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమలు, సంస్థల విస్తరణ ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతును అందిస్తుందని, తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ఆయా సంస్థలు మరింత వృద్ధి సాధించాలని తాము కోరుకున్నట్లు మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే 5, 7 సంవత్సరాల్లో వెల్పన్ గ్రుఫ్ రూ 5వేల కోట్ల పెట్టుబడి పెట్టి 50వేల వరకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా యువతకు ఉపాధి అవకాశలు సృష్టిస్తామన్నారు. నేను మూడు సార్లు ఈ పరిశ్రమను సందర్శించాను, తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడలేని విధంగా పరిశ్రమల స్థాపనకు సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వెల్స్పన్ పరిశ్రమ నిర్వాహకులు ఒక యూనిట్‌ను గుజరాత్‌లో మరో యూనిట్‌ను కర్నాటక రాష్ట్రంలో పెటాట్టాల్సి ఉంది. కానీ రెండు కూడా తెలంగాణ రాష్ట్రానికే వచ్చిన వంటే అది కెసిఆర్‌గారి సమర్థ నాయకత్వమే, కెసిఆర్ పాలనలో ఈ రాష్ట్ర సుభీక్షంగా ఉండటమే అన్నారు.

పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రంలో మౌలికసదుపాయాలు, శాంతిభద్రతలు, వనరుల పుష్కలంగా ఉండడం కూడా కారణంగా చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెటేందుకు అనేక పరిశ్రమలు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా స్థానిక యువతకే ఎక్కువగా ఉపాధి కల్పించాలన్నారు. వారికి తగిన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికే ఎక్కువగా అవకాశలు ఇవ్వాలన్నారు. సింటెక్స్ పరిశ్రమతో మెడిన్ చందన్‌వెళ్లి ఇన్ తెలంగాణగా వస్తుందన్నారు. మహేశ్వరంలో ఎలక్ట్రాక్ పరిశ్రమలు, శేరిలింగంపల్లి నిండ ఐటీ పరిశ్రమ ఉంది. రాజేద్రనగర్‌లో కూడా ఐటీ టూరిజం బలంగా వస్తుంది. వికారాబాద్‌లో తెలంగాణ మ్యుబిలిటి వ్యాలీఅక్కడ రాబోతుందన్నారు. తాండురులో కూడా బ్రహ్మండమైన పరిశ్రమలు ఉన్నాయని, మరిన్ని పరిశ్రమలు వచ్చే విధంగా మంత్రి మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ దిశానిర్ధేశంలో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శం అన్నారు. కెటిఆర్ కృషితో దేశ, విదేశీ పెట్టుబడిదారులు వారి పెట్టుబడులు వరదలా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారిందాని.. వేల మందికి ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. ప్రపంచ చిత్రపటంలో షాబాద్ మండలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. రూ. 370 కోట్ల పెట్టుబడులతో 1000 మందికి ఉద్యోగ కల్పన వస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 1358 పరిశ్రమలు రూ. 62 వేల 832 కోట్ల పెట్టుబడులతో స్థాపించబడగా వీటిలో 7లక్షల 6000 మందికి ఉద్యోగులుగా పనిచేస్తున్నారన్నారు. రూ. 1400 కోట్ల పెట్టుబడులతో సింటెక్స్ పరిశ్రమలో 12వేల మందికి ఉద్యోగ కల్పన వస్తుందన్నారు. వికారాబాద్ జిల్లాలోను అనువైన ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో కలిసి భారీ పరిశ్రమల స్థాపన కోసం సీఎం కెసిఆర్‌కు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేవేళ్ళ ఎంపి రంజిత్ రెడ్డి ,ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రోహిత్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ అనీతారెడ్డి, టిఎస్‌ఐఎసి ఎండి వెంకట్ నరసింహారెడ్డి ,కలెక్టర్ హరిష్, ఆర్డీఓ సాయిరాం, అన్ని శాఖాధికారులు, వెల్స్పన్ గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana in forefront of development

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News