Monday, December 23, 2024

అవకతవకలు జరగలేదు

- Advertisement -
- Advertisement -

గ్రూప్1 ప్రిలిమ్స్‌లో అభ్యర్థుల సంఖ్యపై టిఎస్‌పిఎస్‌సి స్పష్టత

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఇటీవలే హైకోర్టు టిఎస్‌పిఎస్‌సికి స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. జూన్ 11న జరిగిన ప్రిలి మ్స్ పరీక్షపై గురువారం వివరణ ఇచ్చింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై ఒక ప్రకటన విడుదల చేసింది. పరీక్ష రోజు కలెక్టర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రకటన ఇచ్చామని 2,33,248 మంది పరీక్ష రాసినట్లు పేర్కొంది. పారదర్శకత కోసం మీడియాకు చెప్పామని ఓఎంఆర్ స్కానింగ్‌లో 2,33,506 మంది పరీక్ష రాశారని తేలిందని వెల్లడించింది.

గ్రూప్-1  ప్రిలిమ్స్ 33 జిల్లాల్లో 994 కేంద్రాల్లో నిర్వహిస్తే లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. లక్షల మంది రాసినప్పుడు అంకెల్లో స్వల్ప మార్పులు సహజమేనని, స్కానింగ్ తరువాత తుది సంఖ్య ప్రకటించామని, పరీక్ష తరువాత కొన్ని పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదని వెల్లడించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టిఎస్‌ఎపిఎస్సీ తెలిపింది. పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సబబేనని హైకోర్టు బుధవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గతంలో ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించినపుడు మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని, అలా తీసుకున్నట్లు కనిపించలేదంది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. పరీక్షను రద్దు చేసి తిరిగి నిబంధనల ప్రకారం నిర్వహించాలన్న సింగిల్ జడ్జి నిర్ణయం సమర్ధనీయమేనని జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ జె. అనిల్ కుమార్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News