Monday, December 23, 2024

కెసిఆర్ తోనే పాలమూరు పచ్చబడింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

వనపర్తి: వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. వనపర్తి జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. సంకిరెడ్డిపల్లి దగ్గర ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండిస్తున్నామని, సిఎం కెసిఆర్ విజన్‌తోనే పాలమూరు పచ్చబడిందని, భూమాతకు ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుగా ఉందని, పాలమూరు పచ్చదనాన్ని పరుచుకుందన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తోందని, రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు. రైతు బీమా, రైతు బంధుతో రైతులకు భరోసా కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News