Monday, December 23, 2024

కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్షమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. వంద పడకల ఆస్పత్రుల భవన నిర్మాణాలకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సిఎం కెసిఆర్ దేశంలో నంబర్ వన్‌గా తీర్చి దిద్దారని కొనియాడారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపి మాలోతు కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌ఎ రెడ్యానాయక్, బిఆర్‌ఎస్ నేతలు, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News