- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 24 గంటల కరెంట్ ఇస్తే తాను ఎంఎల్‌ఎగా పోటీ చేయనని సవాల్ విసిరారు. విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని, పరీక్షల నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు 15వ తారీకున ఇస్తున్నారని, ఝార్ఖండ్‌లో కూడా ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తనతో వస్తే కర్నాటక రాష్ట్రంలో అమలవుతన్న పథకాలు చూపిస్తానని బిఆర్‌ఎస్ మంత్రులు వస్తే స్పెషల్ ఫ్లైట్ పెడతానని వివరించారు. ఎపి, కర్నాటకలో బిఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడంలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
- Advertisement -