- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచులు, జడ్పీటిసి, ఎంపిపిలతో పాటు 50 మంది నియోజకవర్గ సీనియర్, ముఖ్య నాయకులు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కెటిఆర్ సమక్షంలో ప్రగతి భవన్ లో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు దృష్ట్యా, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు ప్రకటించారు. దీంతో మంత్రి కెటిఆర్ వారికి పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అటు ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
- Advertisement -