Thursday, December 26, 2024

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

హన్వాడ: మండల పరిధిలోని ఎల్లంబావి తండాలో రూ. 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభంతో పాటు రూ. 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ… గతంలో తాగునీటి కోసం బోర్ వేసి అందుకు ఓ శిలాఫలకం ఏర్పాటు చేయడం చూసి తనకు ఆశ్చర్యం వేసిందని, ఒక బోరు కోసం కూడా శిలాఫలకం వేసేలా గత పాలన సాగిందని మంత్రి తెలిపారు.

ప్రతి చిన్న పనికి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సిన దుస్థితి ఉండేదని నేడు దర్‌జాగా వారి తండాను గ్రామ పంచాయతీ చేసుకొని అన్ని పనులు స్థానికంగానే అయ్యేలా చేశామన్నారు. ముంబై, పుణె వలసలు వెళ్లాల్సిన దుస్థితి లేకుండా అందరూ స్థానికంగానే జీవించేలా ఉద్‌యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. హైదరాబాద్‌లో సేవాలాల్ భవనాన్ని సీఎం కేసిఆర్ ఎంతో గొప్పగా నిర్మిస్తే వారి అడుగుజాడల్లో నడుస్తూ మహబూబ్‌నగర్‌లో తాము గిరిజన భవన్ నిర్మించామని అన్నారు. మన జీవితాలు బాగు చేసేది కారు గుర్తు మాత్రమేనని ప్రజలంతా అర్థం చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, బీజేపీ అధికారంలో ఉన్న మహరాష్‌ర్టలో తెలంగాణలో అమల్లో ఉన్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు వంటి పథకం ఒకటైన అమలవుతుందా అని ప్రశ్నించారు. అప్పటికి ఇప్పటికి అభివృద్ది, సంక్షేమంలో తేడాను గమనించాలని, మన బతుకులు బాగు పడాలంటే మళ్లీ సీఎం కేసిఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయ నిర్మల , రమణారెడ్డి, ఎంపీడీఓ ధనుంజయ, తహసీల్దార్ కిష్టానాయక్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, ముడా డైరెక్టర్ కొండా బాలయ్య, రైతు బంధు సమితి డైరెక్టర్ కొండా లక్ష్మయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్ , వైస్ ఎంపీపీ లక్ష్మీమోహన్ నాయక్ , జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అన్వర్ , మండల కో ఆప్షన్ సభ్యుడు మన్నన్, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ శేఖరాచారి, మాజీ జడ్పీటీసీ నరేందర్, జంబులయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News