రాజోలి: రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాన్‌దొడ్డి, పచ్చర్ల గ్రామాలలోని 10 మంది గర్భిణీ స్త్రీలకు శుక్రవారం ఆరోగ్య న్యూట్రిషన్ కిట్లను మెడికల్ ఆఫీసర్ డా. మధుబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న న్యూట్రిషన్ కిట్లను ప్రతి గర్భిణీ స్త్రీ ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఆకుకూరలతో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవాలని, అదే విధంగా న్యూట్రిషన్ కిట్ లోని ఖరూర, నెయ్యి, మదర్ హార్లిక్స్ ఫౌడర్, ఐరన్ సిరప్, ఆల్బెండజోల్ మాత్రలు ఉంటాయని ఆయన వివరించారు.
వీటిని ఎప్పుడు ఎలా వాడాలో గర్భిణీ స్త్రీలకు ఆయన అవగాహన కల్పించడం జరిగింది. గర్భిణీ స్త్రీలు బరువు పనులు చేయకూడదని, అదేవిధంగా అలసట వచ్చేలా ఏ పని చేయరాదని ఆయన తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి దగ్గర కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయితేనే తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిబి సూపర్‌వైజర్ జయప్రకాశ్, స్టాఫ్ నర్స్ జమున, ఏఎన్‌ఎంలతో పాటు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.